మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన కేఏ పాల్

KA Paul criticizes Janasena's Pawan Kalyan. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి జనసేనాని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on  15 Jan 2023 7:30 PM IST
మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి జనసేనాని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడంటూ పాల్ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటారని అన్నారు. పవన్ ఎందుకు ఓట్లు చీల్చుతున్నాడో చెప్పాలని పవన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని కేఏ పాల్ సలహా ఇచ్చారు. ఒకవేళ రాజకీయాల నుంచి తప్పుకోకపోతే తమ ప్రజాశాంతి పార్టీలోకి రావాలని పవన్ కు ఆహ్వానం పలికారు. పవన్ కళ్యాణ్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటారని వ్యాఖ్యానించారు. జేడీఏ లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు జనసేనలోకి వెళ్లరని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను ఎందుకు ఓట్లు చీలుస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ సర్కారు తీసుకువచ్చిన జీవో నెం.1ని స్వాగతిస్తున్నట్టు పాల్ వెల్లడించారు. వైసీపీ నేతలు ఇరుకు సందుల్లో పెట్టినా తాను అడ్డుకుంటానని.. అది ప్రాణాలు కాపాడే జీవో అని పేర్కొన్నారు. మూడేళ్ల కిందటే రావాల్సిన జీవో అని, ఇప్పటికి వచ్చిందని అన్నారు.


Next Story