ఏపీ ప్రభుత్వానికి జూనియర్‌ డాక్టర్ల షాక్‌.. 9నుండి స‌మ్మెబాట

Junior Doctors Strike Notice to AP Govt. క‌రోనా కేసులు ఇప్పుడిప్పుడే త‌గ్గుతున్న నేఫ‌థ్యంలో.. ఏపీలో సీనియర్, జూనియర్ రెసిడెంట్

By Medi Samrat  Published on  7 Jun 2021 8:00 AM GMT
ఏపీ ప్రభుత్వానికి జూనియర్‌ డాక్టర్ల షాక్‌.. 9నుండి స‌మ్మెబాట
క‌రోనా కేసులు ఇప్పుడిప్పుడే త‌గ్గుతున్న నేఫ‌థ్యంలో.. ఏపీలో సీనియర్, జూనియర్ రెసిడెంట్ వైద్యులు స‌మ్మెబాట ప‌ట్టనున్నామ‌ని ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీ నుండి విధులు బహిష్కరించ‌నున్న‌ట్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. కొవిడ్‌ డ్యూటీలు చేస్తున్న మెడికల్‌ విద్యార్థులకు ఇన్సెంటివ్స్‌ ఇవ్వాలని.. ఎస్‌ఆర్‌లకు స్టైఫండ్‌ పెంచాలని.. స్టైఫండ్‌ నుంచి టీడీఎస్‌ కటింగ్‌ లేకుండా చూడాలని.. కొవిడ్‌ విధులు నిర్వహించే జూనియర్‌ డాక్టర్లకు, ఎస్‌ఆర్‌లకు కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌కు అవకాశం కల్పించాలన్న డిమాండ్‌తో స‌మ్మె నోటీస్ ఇచ్చారు జూనియర్ డాక్టర్లు. 9నుండి ఎమర్జెన్సీ సేవలు మినహ అన్ని బహిష్కరించనున్నట్లు స‌మ్మె నోటీస్‌లో పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్ల స‌మ్మె నేఫ‌థ్యంలో.. ఏపీ ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి మ‌రి.


ఇదిలావుంటే.. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 83,690 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 8,976 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 17,58,339కి చేరింది. నిన్న 13,568 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,23,447కి పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,466కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,23,426 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,97,91,721 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story