టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jogi Ramesh Sensational Comments On TDP. వైసీపీ నేత, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి వైసీపీ
By Medi Samrat Published on 21 Aug 2021 12:50 PM GMT
వైసీపీ నేత, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. టీడీపీ తెలుగు తాలిబన్ పార్టీగా మారిందని.. ఆ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. చంద్రబాబు విశ్వ బ్రాహ్మణుల తోకలు కట్ చేస్తా అన్నారని.. అగ్నికుల క్షత్రియులను తరిమికొడతా అన్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనార్టీలు కలిసి కుటుంబంలా ఉన్నారని.. కులాల మధ్య చిచ్ఛులు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జోగి రమేష్ ఫైర్ అయ్యారు.
బలహీన వర్గాలు అంబేద్కర్ ను దేవుడిలా పూజిస్తున్నారని.. ముఖ్యమంత్రి జగన్ కూడా అన్ రిజర్వేడ్ స్థానాలలో 75 కార్పొరేషన్‌లలో అధికశాతం బలహీన వర్గాలకు ఇచ్చారని అన్నారు. నేను అంబేద్కర్ గురించి, సీఎం జగన్ గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించారని మండిపడ్డారు. విచ్చిన్న ఆలోచలతో విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని మాట్లాడిన చంద్రబాబుపై కేసు పెట్టాలా.? ఉరి తీయాలా.? ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలను జగన్ బలమైన వర్గంగా చేస్తున్నారని.. సంక్షేమ పథకాలను టీడీపీ జీర్ణించుకోలేక పోతుందని అన్నారు. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నా.. కోర్టులకు వెళుతున్నారని ఫైర్ అయ్యారు. బలహీన వర్గాలు అంబేద్కర్ ను దేవుడిలా పూజిస్తాయని.. జగన్ కు జేజేలు పలుకుతాయని జోగి రమేష్ అన్నారు.