గుడ్‌న్యూస్ : కొత్త‌గా 1,180 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి

Job Notification In AP. కొత్త‌ ఉద్యోగ నియామకాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ ద్వారా

By Medi Samrat  Published on  29 July 2021 7:09 PM IST
గుడ్‌న్యూస్ : కొత్త‌గా 1,180 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి

కొత్త‌ ఉద్యోగ నియామకాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ ద్వారా 1,180 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి మంజూరు చేసింది. ఆయుష్, రెవెన్యూ విభాగాలతో పాటు, పలు శాఖల్లోని ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ నియామకాల్లో భాగంగా రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా, జూన్ 18 నాటి ప్రకటనకు అనుబంధంగా తాజా ఉద్యోగాలను కూడా జాబ్ క్యాలెండర్ లో చేర్చాలని ఆర్థికశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు ఈబీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని స్పష్టం చేసింది. కాగా, ఈ నోటిఫికేషన్ ఆగస్టులో వెలువడే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.





Next Story