అన్ని ఉన్నా అనుభవించరు కొందరు.. అన్ని లేకా ఆరాటపడుతుంటారు మరికొందరు. కొందరైతే నచ్చిన వ్యక్తి కోసం అన్ని వదిలేసుకుంటారు. తాజాగా జపాన్‌ యువరాణి అదే పని చేసింది. తన బాయ్‌ఫ్రెండ్‌ కోసం యువరాణి మాకో వారసత్వ సంపదను వదులుకునేందుకు సిద్ధమైంది. జపాన్‌ చక్రవరి అఖిహిటోకు యువరాణి మాకో ముని మనవరాలు. సాధారణ కుటుంబానికి చెందిన కౌమురో, యువరాణి మాకో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో ఆమె తన బాయ్‌ఫ్రెండ్ అయిన కీయ్ కౌమురోను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే ఈ పెళ్లి ఎప్పుడో జరగాల్సి ఉన్న కౌమురో తల్లికి, ఆమె మాజీ లవర్‌ కొన్ని ఫైనాన్షియల్ కారణాల వల్ల పెళ్లి ఆగుతూ వచ్చింది.

అక్టోబర్‌ నెలలో వారికి వివాహం జరగనున్నట్లు జపాన్‌ మీడియా వర్గాలు తెలిపాయి. 2017లో యువరాణి మాకోకి, తన బాయ్‌ఫ్రెండ్ కౌమురోకి నిశ్చితార్థం జరిగింది. జపాన్‌ రాచ కుటుంబంలోని అమ్మాయిలు ఎవరైనా సాధారణ కుటుంబాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటే.. వారికి రావాల్సిన భరణాన్ని ఇవ్వకుండా ఆపేస్తారు. సాధారణంగా రాచకుటుంబలోని అమ్మాయిలకు భరణంగా 13 లక్షల డాలర్లు ఇస్తారు. అయితే ఇంత ఆస్తిని వదులుకునేందుకు యువరాణి మాకో అంగీకారం తెలిపినట్లు జపాన్‌ మీడియా వర్గాలు తెలిపాయి. మాకో తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత రాచరిక వారసత్వ చట్టం ప్రకారం.. రాచరిక హోదా పోతుంది.


అంజి

Next Story