జానీ మాస్ట‌ర్‌ను దూరంగా ఉండ‌మ‌న్న జ‌న‌సేన‌

ఏపీ ఎన్నికల ముందు జనసేన పార్టీ (జేఎస్పీ)లో చేరిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌.. 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాయ‌దుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు

By Medi Samrat  Published on  16 Sept 2024 4:20 PM IST
జానీ మాస్ట‌ర్‌ను దూరంగా ఉండ‌మ‌న్న జ‌న‌సేన‌

ఏపీ ఎన్నికల ముందు జనసేన పార్టీ (జేఎస్పీ)లో చేరిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌.. 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాయ‌దుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన అధిష్టానం జానీ మాస్ట‌ర్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని జానీ మాస్ట‌ర్‌ను ఓ ప్ర‌క‌ట‌న‌లో ఆదేశించింది. లైంగిక వేధింపులకు సంబంధించి కేసు న‌మోదైన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని పేర్కొంది.


మహిళా కొరియోగ్రాఫర్ త‌న‌ ఫిర్యాదులో.. చెన్నై, ముంబై, హైదరాబాద్‌లో అవుట్‌డోర్ షూట్‌లతో పాటు తన నార్సింగి నివాసంలో కూడా జానీ మాస్ట‌ర్ త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు.. జానీ మాస్టర్‌పై IPC సెక్షన్ 376 (రేప్), 506 (నేరపూరిత బెదిరింపు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. చట్టపరమైన చర్యలతో పాటు, తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ లైంగిక వేధింపుల నివారణ చట్టం కింద అంతర్గత విచారణకు సిఫారసు చేశారు.

Next Story