మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తోంది. ఇక అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండగా.. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని ప్రకటన వచ్చింది.
"మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోంది. ఇందుకు సంబంధించి సంతృప్తికర ఫలితాలు వచ్చిన అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తారు" అంటూ అధికారిక ప్రకటన వచ్చింది.