ఆ అభ్యర్థిని మార్చేసిన జనసేనాని

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

By Medi Samrat  Published on  4 April 2024 8:00 PM IST
ఆ అభ్యర్థిని మార్చేసిన జనసేనాని

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా తొలుత యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పవన్ కళ్యాణ్, ఇతర జనసేన అగ్రనేతలు పరిశీలించారు. రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన, టీడీపీ వర్గాలతో చర్చించిన పవన్ కళ్యాణ్.. రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అరవ శ్రీధర్ ను రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. అరవ శ్రీధర్ మూడ్రోజుల కిందటే తన అనుచరులతో సహా జనసేనలో చేరారు. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె గ్రామ సర్పంచ్ గా ఉన్నారు.

అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్‌ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో పవన్ చర్చలు జరిపారు. ఆ తర్వాతే బుద్ధ ప్రసాద్‌ ఎంపికను ఖరారు చేశారు. ఈ మేరకు అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా బుద్దప్రసాద్‌ పేరును అధికారికంగా ప్రకటించారు.

Next Story