బిగ్‌ బ్రేకింగ్‌: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. నిర్మలాదేవీ ఫంక్షన్‌ హాల్‌లో పవన్‌ రెస్ట్‌ తీసుకుంటున్నారు.

By అంజి  Published on  27 Jun 2023 11:53 AM IST
Janasena, Pawan Kalyan, ill, APnews

బిగ్‌ బ్రేకింగ్‌: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వారాహి యాత్రలో భాగంగా పవన్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పవన్‌ కల్యాణ్‌ నిరంతరాయంగా వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అస్వస్థత గురైనట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వారాహి యాత్రలతో సరిగ్గా విశ్రాంతి లేకపోవడంతో పవన్ ఆరోగ్యం కొంచెం దెబ్బ తిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పెద అమిరంలోని నిర్మలాదేవీ ఫంక్షన్‌ హాల్‌లో పవన్‌ రెస్ట్‌ తీసుకుంటున్నారు. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గ నాయకులతో నిర్వహించాల్సిన భేటీని వాయిదా వేశారు.

మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఈ సమావేశంలో ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు జనసేనలో చేరనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్‌.. వారాహి యాత్ర చేపట్టారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్లాలని ఉద్దేశ్యంతో రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వెళుతున్నారు. ఏపీ ప్రజల కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని పవన్‌ గతంలో అన్నారు.

Next Story