జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హై టెన్షన్

Janasena 10th Formation Day. మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు.

By Medi Samrat
Published on : 14 March 2023 4:32 PM IST

జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హై టెన్షన్

Janasena Chief Pawan Kalyan


మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ విజయవాడ ఆటోనగర్ నుంచి వారాహి వాహనంలో మచిలీపట్నం బయల్దేరారు. భారీగా పార్టీ శ్రేణులు వెంటరాగా వారాహి ముందుకు కదులుతోంది. విజయవాడ బందరు రోడ్డు జనంతో కిక్కిరిసిపోవడంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పవన్ సభ నేపథ్యంలో విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హై టెన్షన్ నెలకొంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

జనసేన పార్టీ 10వ వార్షిక ఆవిర్భావ సభ మంగళవారం సాయంత్రం 5 గంటలకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరగనుంది. ఈ సభ కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మచిలీ పట్నం బయల్దేరారు. మచిలీపట్నం శివార్లలో దాదాపు 35 ఎకరాల్లో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పవన్ సభాప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంది. పవన్ రాక ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. రాత్రి 9 గంటల వరకు జనసేన సభ జరగనుంది.


Next Story