పల్నాడుకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడులో పర్యటించనున్నారు.
By - Medi Samrat |Published on : 15 Jun 2025 9:17 PM IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడులో పర్యటించనున్నారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జూన్ 18వ తేదీన వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా రూట్ మ్యాప్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు పరిశీలించారు. మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, వైసీపీ నేతలు పరిశీలించారు. జూన్ 18న రెంటపాళ్లలో గ్రామ ఉప సర్పంచ్ కోర్లకుంట నాగ మల్లేశ్వరరావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన రానున్నారు. నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు.
ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రాగానే అరాచకం మొదలైందని, అందుకు నిలువెత్తు నిదర్శనం నాగమల్లేశ్వర రావు ఆత్మహత్యేనన్నారు విడదల రజిని. రాష్ట్రంలో ఏడాదిగా అరాచక పాలన కొనసాగుతోందని, రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగుతోందన్నారు.
Next Story