'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమం ప్రారంభం

Jagananne Maa Bhavishyathu Campaign. రాష్ట్రవ్యాప్తంగా 'జగనన్నే మా భవిష్యత్తు' అనే మెగా పీపుల్ సర్వే కార్యక్రమం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో

By Medi Samrat  Published on  7 April 2023 3:25 PM IST
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా 'జగనన్నే మా భవిష్యత్తు' అనే మెగా పీపుల్ సర్వే కార్యక్రమం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభమైంది. 2 వారాల పాటు జరిగే ఈ మెగా పీపుల్ సర్వే ద్వారా వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని పచ్రారం చేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రి బొత్సతో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీ సంజీవ్ కుమార్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొని మెగా పీపుల్ సర్వే కార్యక్రమం గురించి మీడియాకు వివరాలు వెల్లడించారు.

నిష్పక్షపాతంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ, ఆర్థిక పురోగతి కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్ కు మాత్రమే దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి ఉదయం నుంచే ఈ కార్యక్రమం మొదలైందని తెలిపారు. నేటి నుంచి రెండు వారాల పాటు మా నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరాలు చెప్పి వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారని తెలిపారు.

1.65 కోట్ల ఇళ్లకి వెళ్లి ఈ సర్వే చేపడతాం. 7 లక్షలు మంది పార్టీ సైనికలు, సచివాలయ కన్వీనర్ లు ఈ సర్వే కోసం అందుబాటులో ఉంటారని తెలిపారు. సీఎం జగన్‌ ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి గల తేడాలను పోల్చి చెప్ప‌డం ద్వారా ప్రజా మద్దతు పుస్తకంలో ప్రజల స్పందనను నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు.

ఇంటి యజమానికి అంగీకారంతో ఇంటి తలుపుకి మా నమ్మకం నువ్వే జగనన్న స్టికర్ అతికిస్తాం.. సెల్ ఫోన్ కి కూడా స్టికర్ అతికిస్తాం అని తెలిపారు. ప్రజల మొబైల్ నెంబర్ నుంచి 82960 82960 నంబర్ కి మిస్డ్ కాల్ ద్వారా జగనన్న కీలక సందేశం ప్రజలకు అందిస్తారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మళ్ళీ వైస్సార్ పాలనే వ‌స్తుంద‌ని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి విశ్వాసం వ్య‌క్తం చేశారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం జరగడం ఇదే మెదటిసారి అని తెలిపారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ సీఎంగా జగనే ఉండాలని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కుల, మత, పార్టీలకు అతీతంగా ఈ మెగా పీపుల్ సర్వే జరుగుతుందని అన్నారు.

సీఎం జగన్ స్థానం ప్రజల గుండెల్లోన‌ని ఎంపీ సంజీవ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం సమాజంలో పేదలకు, ధనికులకు మధ్య యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్ పేదల తరుపున యుద్ధం చేస్తున్నారు. సీఎం జగన్ ఒక కారుణ జన్ముడు.. అయన ఒక దేవుడని కొనియాడారు. సామజిక కుట్రలు జరుగుతున్నాయి.. వాటిని ప్రజలు తిప్పికొట్టాలని పార్టీ శ్రేణుల‌కు సూచించారు.

సంక్షేమం, అభివృద్ధి చేసామనే ధీమాతో ప్రజల ముందుకు వెళ్తున్నామ‌ని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. ఇప్పటికే గడప గడపకి తిరిగి ప్రజలకి జరిగిన అభివృద్ధి వివరించి చెబుతున్నాము. ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్స్ సర్వే కోసం ధైర్యంగా ప్రజల ముందుకు వెళుతున్నామ‌న్నారు.


Next Story