జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ కోర్టు జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై ఈనెల 1న జరిగిన విచారణ సందర్భంగా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని జగన్, రఘురామకృష్ణరాజుతోపాటు సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. తమ వాదనలను జగన్, రఘురామ లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. అయితే తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించబోవడంలేదని సీబీఐ అధికారులకు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. దీంతో వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

అక్రమ ఆస్తుల కేసులో సీఎం జగన్ ప్రస్తుతం బెయిల్‌పై బయటున్నారు. అయితే జగన్ బెయిల్ కండీషన్స్ ఉల్లంఘించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు రిజాయిండర్ కూడా వేశారు. తన కేసుల్లో తనతో పాటు నిందితులుగా ఉన్నవారికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ లబ్ది చేకూరుస్తున్నారని రఘురామ ఎన్నో ఆరోపణలు చేశారు. సాక్ష్యులను బెదిరించేందుకు, ప్రభావితం చేసేందుకు పలు మార్గాల్లో ప్రయత్నించారని రఘురామ పిటిషన్‌లో వెల్లడించారు. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది.


సామ్రాట్

Next Story