వైసీపీ రాజ్య సభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కి చెందిన 15 చోట్ల ఐటీ సోదాలు నిర్వహించారు. వైసీపీ ఎంపీ,రాంకి గ్రూపు చైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. అయోధ్య రామిరెడ్డికి చెందిన గచ్చిబౌలి నివాసంలో సోదాలు నిర్వహించారు అధికారులు. అలాగే.. గచ్చిబౌలి లోని రాంకి ప్రధాన కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు. రాంకి అనుబంధ సంస్థల్లో సైతం ఐటీ సోదాలు నిర్వహించగా.. 15 బృందాలతో వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం జరిగింది.
అయోధ్య రామిరెడ్డికి చెందిన ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఉదయం నుంచీ దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఐటీ విభాగానికి చెందిన దాదాపు 15 మంది అధికారుల బృందం పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది. ఇందులో గచ్చిబౌలిలోని రాంకీ గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు గ్రూప్ అనుబంధ సంస్ధల కార్యాలయాలు, అయోధ్య రామిరెడ్డి నివాసం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రాంకి గ్రూప్ కంపెనీలు చూపిన నష్టాలు నిజమైనవి కాదా అని తనిఖీ చేయడానికి ఈ దాడులు జరుగుతున్నాయని ఆదాయపన్ను శాఖ వర్గాలు తెలిపాయి. రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ ఈ గ్రూపులోని రెండు ప్రధాన సంస్థలు. అయోధ్య రామి రెడ్డి ప్రస్తుతం ఈ కంపెనీలకు డైరెక్టర్ గా లేరు.