చివరి నిమిషంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా
'ప్రోబా-3'లో కొన్ని లోపాల కారణంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) PSLV-C59 ప్రయోగాన్ని వాయిదా వేసింది.
By Medi Samrat Published on 4 Dec 2024 6:15 PM IST'ప్రోబా-3'లో కొన్ని లోపాల కారణంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) PSLV-C59 ప్రయోగాన్ని వాయిదా వేసింది. ఈ ప్రయోగం ఈరోజు సాయంత్రం 4.08 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగం జరగాల్సి ఉంది. అయితే.. ప్రయోగానికి కొద్ది నిమిషాల ముందు ఇది ఆగిపోయింది.
'ప్రోబా-3'లో కొన్ని లోపాల కారణంగా పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో తెలిపింది. ఇస్రో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ సమాచారాన్ని ఇచ్చింది. "ప్రోబా-3 స్పేస్‌క్రాఫ్ట్‌లో క్రమరాహిత్యం కనుగొనబడినందున PSLV-C59/Proba-3 యొక్క ప్రయోగం రేపు 16:12 గంటలకు రీషెడ్యూల్ చేయబడింది" అని అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు ఇచ్చిన సమాచారం ద్వారా తెలిపింది.
ISRO.. PROBA-3 మిషన్ ఐరోపాలోని అనేక దేశాల భాగస్వామ్య ప్రాజెక్ట్. వీటిలో స్పెయిన్, పోలాండ్, బెల్జియం, ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ మిషన్ ఖర్చు దాదాపు 200 మిలియన్ యూరోలుగా అంచనా. ప్రోబా-3 మిషన్ దాదాపు 2 సంవత్సరాల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ మిషన్‌లోని ప్రత్యేకత ఏమిటంటే.. దీని సహాయంతో అంతరిక్షంలో 'ప్రెసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్' పరీక్షించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మిషన్ కింద రెండు ఉపగ్రహాలు అంతరిక్షంలో కలిసి ఎగురుతాయి. రెండూ ఒకే స్థిరమైన కాన్ఫిగరేషన్‌ను నిర్వహిస్తాయి.
ప్రోబా-3 (ప్రాజెక్ట్ ఫర్ ఆన్‌బోర్డ్ అనాటమీ) రెండు ఉపగ్రహాలు ఏకకాలంలో ఎగురుతూ.. సూర్యుని బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుండి ఈ ఆర్డర్‌ను అందుకుంది. మిషన్ ముఖ్యమైన లక్ష్యం.. ఖచ్చితత్వంతో ఎగరడం, సూర్యుని బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేయడంగా చెబతున్నారు.