ప్రధాని టూర్‌కు అన్ని రాజకీయ పక్షాలకు ఆహ్వానం పంపించాం: నారాయణ
మే2 న ప్రధాని అమరావతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి నారాయణ అన్నారు.
By Knakam Karthik
ప్రధాని టూర్‌కు అన్ని రాజకీయ పక్షాలకు ఆహ్వానం పంపించాం: నారాయణ
మే2 న ప్రధాని అమరావతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి నారాయణ అన్నారు. 5 లక్షల మంది జనం ప్రధాని బహిరంగ సభకు హాజరుకానున్నారని.. వీరి కోసం కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశామని.. సుమారు పదివేల వాహనాలు వరకు అమరావతి రానున్నాయని ఆ వాహనాలు కోసం 11 చోట్ల ఏర్పాటు చేసినట్లు మంత్రి నారాయణ చెప్పారు.. ఒకవేళ వర్షం వస్తే ప్రత్యామ్నాయంగా రాజధాని లో వేసిన 350 కిలోమీటర్ల రహదారుల మీద ఆ వాహనాలు నుంచి ఉంచేలా ఏర్పాటు చేసినట్లు నారాయణ తెలిపారు.. అమరావతి నిర్మాణ పనుల పునర్ నిర్మాణo కార్యక్రమానికి అన్ని.. రాజకీయ పక్షాలను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
రవాణా, పార్కింగ్ ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. వర్షం వస్తే పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. దీనిపై పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. 3000 బస్సులు, 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు ముందుగా చేశారన్నారు. ఈ సభకు 5 లక్షల పైగా జనాభా వచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్‌కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. 6500 - 7000 బస్సులు, 3000 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
కాగా ప్రధాని మోడీ మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులకు పీఎం శంకుస్థాపన చేయనున్నారు. రోడ్ షోతో పాటు బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన ప్రధాని బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లు చేశారు.