తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను ఉపముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యన్నారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైలం దేవస్ధానం ఛైర్మన్ రెడ్డి వారి చక్రపాణిరెడ్డి. దేవస్ధానం కార్యనిర్వహణాధికారి లవన్న, ఆలయ అర్చకులు కలిశారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం జగన్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ ప్రధాన అర్చకులు. అనంతరం శ్రీశైలం దేవస్ధానం క్యాలెండర్‌ను, డైరీని ఆవిష్కరించారు సీఎం జగన్. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి.