నేటి నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ సర్వీసులు పునః ప్రారంభం కానున్నాయి. ఓమన్ దేశంలోని మస్కట్, కువైట్, సింగపూర్ ఇతర దేశాల నుంచి సర్వీసులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్నాయి. ఈ రోజు సాయంత్రం 6.10 గంటలకు 65 మంది ప్రయాణికులతో దుబాయ్ సర్వీస్ చేరుకోనుంది.
ఇదిలావుంటే.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి విదేశీ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపొయాయి. వందే భారత్ మిషన్లో భాగంగా రానున్న విదేశీ సర్వీసులకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం మినహా ఇతర రోజుల్లో వారానికి 10 విదేశీ సర్వీసులు రానున్నాయి. రానున్న అక్టోబర్ వరకు వందే భారత్ మిషన్ లోని విదేశీ సర్వీసులు కొనసాగనున్నాయి.
ఇక ఇప్పటివరకు 18 దేశాల నుంచి 496 ప్రత్యేక విమానాల్లో 56,038 మంది ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి చేరారు. అత్యధికంగా కువైట్ నుంచి 224 విమానాల్లో 29,356 మంది ప్రయాణికులు ఏపీకి చేరారని అధికారులు తెలిపారు.