రేపు ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు

Inter Second Year Results. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను శుక్రవారం (జులై 23) సాయంత్రం విడుదల

By Medi Samrat  Published on  22 July 2021 4:42 PM IST
రేపు ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను శుక్రవారం (జులై 23) సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. విద్యాశాఖ‌ మంత్రి ఆదిమూలపు సురేష్.. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది ఇంట‌ర్ బోర్డు. 10వ‌ తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌లో సాధించిన మార్కులను ఆధారంగా చేసుకుని ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు.

ఫలితాల కోసం క్రింది వెబ్‌సైట్‌ల‌లో చూడ‌గ‌ల‌రు

examresults.ap.ac.in

bie.ap.gov.in

results.bie.ap.gov.in

results.apcfss.in

కాగా కరోనా నేపథ్యంలో తొలుత ఏపీ ప్రభుత్వం చివరి క్షణం వరకు పరీక్షలను నిర్వహించాలనే ఉద్దేశంతోనే ముందుకుసాగింది. కానీ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పరీక్షలను రద్దు చేసింది. జులై 31లోపు పరీక్షా ఫలితాలను ప్రకటించాలన్న సుప్రీం ఆదేశాల మేరకు.. అంతలోపు పరీక్షలను నిర్వహించి, ఫలితాలను విడుదల చేయడం అసాధ్యమని భావించిన ఏపీ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది.




Next Story