నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ..ఏపీలో నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 1 March 2025 6:50 AM IST
నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ..ఏపీలో నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,535 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. కాగా 10.58 లక్షల మంది పరీక్షలు రాయనుండగా నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాలులోకి అనుమతించేది లేదని అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను 'నో మొబైల్'గా ప్రకటించారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు అమర్చారు. కాగా, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,00,963 మంది జనరల్ విద్యార్థులు... 44,581 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానున్నారు. కాగా మార్చి 3 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,71,021 మంది జనరల్ విద్యార్థులు హాజరుకానున్నారు.