భారతదేశం.. ప్రపంచానికే ఆదర్శం: సీఎం చంద్రబాబు

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

By అంజి
Published on : 15 Aug 2024 8:22 AM IST

India, CM Chandrababu, Independence Day, APnews

భారతదేశం.. ప్రపంచానికే ఆదర్శం: సీఎం చంద్రబాబు

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం వచ్చిందన్నారు. వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనదని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో సాగుతున్న మన దేశం, ప్రపంచానికే ఆదర్శం అని కొనియాడారు.

అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుంటూ, తాడితపీడిత ప్రజలకు అండగా నిలుస్తూ, బలహీనులకు ధైర్యాన్నిస్తూ ముందుకు సాగాలనేది పెద్దలు మనకు నేర్పిన పాఠమని, అందుకు అనుగుణంగానే మనం అడుగులు వేస్తున్నామన్నారు. అభివృద్ధి ఫలాలను అందరికి అందించే బృహత్ బాధ్యతతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఈ స్వాతంత్య్ర దినోత్సవం జనజీవితాలకు కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నానంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

Next Story