డిప్యూటీ సీఎం పవన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.

By Medi Samrat
Published on : 15 April 2025 6:56 PM IST

డిప్యూటీ సీఎం పవన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు ఆయన భార్య అన్నా లెజినోవా, కుమారుడు మార్క్‌ శంకర్‌పై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పుష్పరాజ్ అనే అకౌంట్ ను వినియోగిస్తున్న ఒక వ్యక్తి బూతులు తిడుతూ పోస్టు పెట్టగా, మిగిలిన వారిని ఉదయ్ కిరణ్, ఫయాజ్‌గా గుర్తించారు. పుష్పరాజ్ సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్‌లు పెట్టగా వాటికి మిగతా ఇద్దరూ లైక్ కొట్టినట్లు సమాచారం.

Next Story