ఏపీలో గ‌త కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నిలుస్తోన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ర‌మేష్ కుమార్‌ స్వల్ప అస్వస్థతకు గుర‌య్యారు. ఆయన కంటికి ఇన్ఫెక్షన్ అయిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ రోజు కడప జిల్లా పర్యటనకు వెళ్లాల్సిన ఆయన దానిని వాయిదా వేసుకున్నారు. దీంతో ఆయ‌న వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఉదయం 11గంటలకు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఒక రకంగా గత కొద్ది రోజులుగా ఏపీ ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య స్థానిక ఎన్నిక‌ల విష‌య‌మై యుద్ధం నడిచింది. నిమ్మగడ్డ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా.. క‌రోనా నేఫ‌థ్యంలో వీలు కాద‌ని ప్రభుత్వం పేర్కొంది. చివరికి సుప్రీం తీర్పుతో ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు మొదటి దశ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. ఈ క్రమంలో నిమ్మగడ్డ కంటికి ఇన్ఫెక్షన్ రావడం చర్చనీయాంశంగా మారింది.


సామ్రాట్

Next Story