అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 11 మంది ఐఏఎస్‌లకు స్థానం చలనం కల్పించారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబుకు పూర్తి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అటు సౌరభ్ గౌర్‌ను మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ప్రస్తుత టీటీడీ ఈవో శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్‌ను నియమించింది. ముకేష్ కుమార్ మీనాను ఎక్సైజ్ శాఖ, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా, హరిజవహర్ లాల్‌ను దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఎం.వి శేషగిరిబాబును కార్మిక శాఖ కార్యదర్శిగా, సీహెచ్ శ్రీధర్‌కు మైనారిటీ శాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.