ఏపీలో ఐఏఎస్‌ అధికారులు బదిలీ..

IAS Transfers In Andhra Pradesh. ఏపీలో ప‌లువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌

By Medi Samrat  Published on  7 Sep 2021 3:42 AM GMT
ఏపీలో ఐఏఎస్‌ అధికారులు బదిలీ..

ఏపీలో ప‌లువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌(గ్రామ, వార్డు సచివాలయాలు) పి. ప్రశాంతిని సీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా బదిలీ చేసి ఏఎంఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. తూర్పుగోదావ‌రి జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్‌(ఆసరా–సంక్షేమం) జి. రాజకుమారిని గుంటూరు జాయింట్ క‌లెక్ట‌ర్‌(గ్రామ, వార్డు సచివాలయలు)గా బదిలీ చేశారు. కడప సబ్‌ కలెక్టర్‌ పృధ్వీతేజ్‌ను ఇంధన శాఖ డిప్యూటీ కార్యదర్శిగా బదిలీ చేసి ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Next Story
Share it