'జై భీమ్' సినిమా నా జీవితంతో పోలి ఉంది.. ఆ న్యాయవాది కోసం చూస్తున్నా: ఎంపీ రఘురామ

I want a lawyer like 'Chandru' from the movie 'Jai Bhim' to come to my rescue: MP Raghurama. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. ఇటీవల విడుదలైన సూర్య హీరోగా నటించిన 'జై భీమ్‌'

By అంజి  Published on  5 Nov 2021 6:54 PM IST
జై భీమ్ సినిమా నా జీవితంతో పోలి ఉంది.. ఆ న్యాయవాది కోసం చూస్తున్నా: ఎంపీ రఘురామ

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. ఇటీవల విడుదలైన సూర్య హీరోగా నటించిన 'జై భీమ్‌' సినిమా గురించి మాట్లాడారు. 'జై భీమ్‌' సినిమా పూర్తిగా తన జీవితంతో పోలి ఉన్నట్లు అనిపించింద అన్నారు. ఇక ఈ సినిమా కథ తమిళనాడులోని కడలూరులో నిజంగానే జరిగిందని ఎంపీ రఘురామ అన్నారు. ఓ గిరిజన యువకుడిని చేయని నేరానికి అక్రమంగా అరెస్ట్‌ చేస్తారని, ఆ తర్వాత అతడి మృతికి కారణమవుతారని చెప్పారు. ఆ తర్వాత గిరిజన యువకుడి మృతదేహాన్ని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదం కథ అల్లే ప్రయత్నం చేస్తారని వివరించారు. అడ్వొకేట్‌ జనరల్‌ సైతం ఈ కుట్రకు సహకరిస్తాడని.. అయితే న్యాయవాది సూర్య మాత్రం ఒక్క రుపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఈ కేసును వాదిస్తాడని చెప్పారు. లాకప్‌లో గిరిజన యువకుడిని ఏం చేశారో బయటికి తెలిసేలా చేయడమే 'జై భీమ్‌' సినిమా అంటూ ఎంపీ రఘురామ చెప్పుకొచ్చారు.

సినిమాలో ఉన్న చంద్రు అనే న్యాయవాది రోల్‌ రియల్‌లైఫ్‌లో కూడా ఉందన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా చంద్రు రిటైర్‌ అయిన రోజున తన కారును వదిలేసి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులోని లోకల్‌ రైలులు ఇంటికి వెళ్లిపోయాడని, ఆ మహానుభావుడి పాత్రనే హీరో సూర్య పోషించాడని రఘురమా అన్నారు. సినిమాలో గిరిజన యువకుడిని లాకప్‌లో వేసి హింసించిన తీరును చూస్తుంటే.. గతంలో నాకు జరిగిన అనుభవమే గుర్తుకొచ్చిందన్నారు. 'జై భీమ్‌' సినిమాలో గిరిజన యువకుడికి ఎంతో అన్యాయం జరిగింది. 'జై భీమ్‌' సినిమా సంగతి అటుంచితే.. ఎంపీని అయినా నాకే దిక్కులేదున్నారు. సీబీఐ విచారణ కోసం మా అబ్బాయి కోర్టును ఆశ్రయించాడని, ఆరు నెలలుగా దిక్కులేదని అన్నారు. అయితే నన్ను కాపాడేందుకు చంద్రు వంటి న్యాయవాది కోసం ఎదురు చూస్తున్నానని ఎంపీ రఘురామ అన్నారు.

Next Story