నేను నిత్య విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటా: చంద్రబాబు
విజయవాడలో పశు సంవర్ధక శాఖ టెక్ ఏఐ 2.0 కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik
నేను నిత్య విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటా: చంద్రబాబు
విజయవాడలో పశు సంవర్ధక శాఖ టెక్ ఏఐ 2.0 కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నేను నిత్య విద్యార్థిని, ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటా. 1995 నుంచి నేర్చుకుంటూనే ఉన్నా. GFST సంస్థ 6 ఏళ్ల క్రితం ప్రారంభించాం. ఆర్థిక సంస్కరణల వలన దేశం అభివృద్ధి చెందింది. అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అని అన్నా..ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది కనాలి అంటున్నా.. ఎంట్రపెన్యూర్ ను ప్రోత్సహించాను. ప్రపంచం మొత్తం GFST గురించి చెప్పుకోవాలి...అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సాంకేతికత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉన్నారని, వారిలో తెలుగు వాళ్లే అధికమన్నారు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్ లోనే నని చెప్పారు. గతంలో ఏ పని చేయాలన్న ప్రభుత్వం అనుమతి అవసరమన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు రాగానే మార్పులు వచ్చాయని తెలిపారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం తీసుకున్నామని తెలిపారు. అప్పుడే వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ పనులైన సులువుగా చేసుకుని పరిస్థితి వచ్చిందని తెలిపారు.
పేదరికం లేని సమాజమే లక్ష్యం పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టించాలి.. ప్రజలకు అందించాలి అనేది తన ధ్యేయమన్నారు. ఇష్టపడి పని చేస్తే కష్టం ఉండదని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ లో ఇప్పటికే 330 సర్వీసులు ఇస్తున్నామని, మరి కొద్ది రోజుల్లో 400కు పెంచుతామని వెల్లడించారు రెండు మూడు నెలల్లో వాట్సప్ గవర్నన్స్పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలని పిలుపునిచ్చారు. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో మైక్రో ఇరిగేషన్ కు ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని ఆకాంక్షించారు. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు.
నేను నిత్య విద్యార్ధిని. అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను. #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/l7F5KmONPG
— Telugu Desam Party (@JaiTDP) May 14, 2025