విశాఖలోనూ హైడ్రా తరహా చర్యలు: ఎమ్మెల్యే గంటా

విశాఖలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

By అంజి  Published on  27 Aug 2024 3:15 PM IST
Hydraa, Vizag, MLA Ganta Srinivasarao, APnews

విశాఖలోనూ హైడ్రా తరహా చర్యలు: ఎమ్మెల్యే గంటా

ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ సీఎం రేవంత్‌ బాటలో నడిచేందుకు సిద్ధమైందా? అంటే.. టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఏపీలో కూడా హైడ్రా వస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో పార్కులను ఆక్రమించి నిర్మాణాలు చేశారని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గంటా ఆరోపించారు. అలాంటి స్థలాలను వదులుకోవాలని, లేదంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందని గంటా హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందన్నారు.

విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్‌ యార్డును మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని తెలిపారు. అందరితో చర్చించి సీఎం చంద్రబాబు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇతర దేశాల్లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్ నిర్వహణలో దుర్వాసన లేదని.. ఈ విధానంపై అధ్యయనం చేసి రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని చెప్పారు.

Next Story