విజయవాడ: స్టేట్ హ్యుమన్ రైట్స్ కమిషన్ హెడ్ ఆఫీసును విజయవాడ నుంచి కర్నూలుకు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రాష్ట్ర మానవ హక్కుల కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. కాగా తాజాగా అప్పటి ఉత్తర్వులను సవరణ చేస్తూ రాష్ట్ర హెచ్‌ఆర్సీ కార్యలయాన్ని కర్నూలుకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే లోకాయుక్త, ఉపలోకాయుక్తలను కర్నూలులో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే ఇప్పటి వరకు లోకాయుక్త, ఉపలోకాయుక్తలు విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుంచే పని చేశాయి. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకెసినట్లు కనిపిస్తోంది. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా మూడు రాజధానుల ఏర్పాటుకు అంతరాయం కలిగిన మాట వాస్తవమే. అయితే తాజాగా జ్యుడిషీయల్ పరిధిలో ఉన్న మానవ హక్కుల కమిషన్ న్యాయ రాజధాని అయిన కర్నూలుకు తరలించడం వెనుక మూడు రాజధానులకు ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.