అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు.

By -  Medi Samrat
Published on : 24 Oct 2025 7:57 PM IST

అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సెంటు, సెంటున్నర్ర స్థలాలని నివాస యోగ్యం కాని, నిర్మాణాలకు అనువుకాని ప్రాంతాల్లో స్థలాలను ఇచ్చి ప్రజలకు గుదిబండల్లా మార్చడం జరిగిందన్నారు. ఎక్కడైతే నిర్మాణాలు జరుగలేదో అటు వంటి లేఅవుట్లలో లబ్దిదారులను ఒప్పించి చట్టపరంగా వాటిని రద్దుచేసి వారికి మళ్లీ రెండు, మూడు సెంట్లు ఇచ్చే అవకాశాన్ని నేటి సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. చాలా చోట్ల ఈ లేఅవుట్ల నిర్మాణాలకై ప్రైవేటు భూములను సేకరించి, భూ యజమానులకు సొమ్మును చెల్లించడ పోవడం వల్ల లబ్దిదారులకు పట్టాలను కూడా అందజేయడం జరుగలేదన్నారు. అదే విధంగా భూ యజమానులకు డబ్బులు కూడా అందక పలు ఇబ్బందులకు గురవ్వడమే కాకుండా తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించి ఏ విధంగా లబ్దిదారులకు న్యాయం చేయాలనే కోణంలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో సుదీర్ఝంగా చర్చించడం జరిగిందన్నారు. ఈ అంశంపై అధికారుల స్థాయిలో కూడా మరోకసారి సమావేశాన్ని నిర్వహించిన తదుపరి మంత్రి వర్గ ఉప సంఘం భవిష్యత్ కార్యాచరణ ప్రణాకపై తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

అదే విధంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లీగల్ గా ఉన్న అడ్డుంకులను అధిగమించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించేందుకు అడ్వకేట్ జనరల్ తో సంప్రదిస్తామని, వారి అభిప్రాయ తదుపరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి తదుపరి సమావేశంలో తగు నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. జర్నలిస్టులకు ఇచ్చే స్థలాల్లో ఇళ్లు కూడా కట్టించే విధంగా తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

Next Story