Viral Video : చికిత్స పొందుతున్న వృద్ధుడిపై వార్డు బాయ్ దాడి

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లా ఆసుపత్రిలో మానసిక ఒత్తిడికి గురై చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడిపై వార్డు బాయ్ దాడికి పాల్పడ్డాడు

By Medi Samrat
Published on : 3 Sept 2024 7:00 PM IST

Viral Video : చికిత్స పొందుతున్న వృద్ధుడిపై వార్డు బాయ్ దాడి

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లా ఆసుపత్రిలో మానసిక ఒత్తిడికి గురై చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడిపై వార్డు బాయ్ దాడికి పాల్పడ్డాడు. ఎమర్జెన్సీ వార్డులో గులాబ్ ఖాన్‌ అనే వ్యక్తిని వార్డ్ బాయ్ చెంపదెబ్బ కొట్టి, బలవంతంగా ఆసుపత్రి నుంచి బయటకు నెట్టేసిన ఘటన కెమెరాలో రికార్డు అయింది.

హమీర్‌పూర్ జిల్లాకు చెందిన ఖాన్ అనే వ్యక్తి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చాడు. ముందు రోజు రాత్రి ఆసుపత్రిలో మందులు తీసుకున్నాడు. అయితే అతను మరుసటి రోజు ఆసుపత్రిలో చేర్చుకోవాలని అభ్యర్థించాడు. ఇంతలో వార్డ్ బాయ్ పెద్దాయన మీద రెచ్చిపోయాడు. ఈ ఘటన గురించి అడగగా ఆసుపత్రి సిబ్బంది ఖాన్‌ ఓ మానసిక రోగి అని చెప్పారు. అయితే ఈ ఘటన గురించి ఖాన్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ చాలా సాధారణంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆసుపత్రుల్లో రోగుల చికిత్స గురించి ఆందోళన కలిగిస్తోంది. ఇలా ఇష్టమొచ్చినట్లు కొట్టడం సరైనది కాదని నెటిజన్లు అంటున్నారు.

Next Story