హిందూపురంను.. శ్రీసత్యసాయి జిల్లాగా ప్రకటించాలి: ఎమ్మెల్యే బాలకృష్ణ

Hindupurm should be declared as a district: MLA Balakrishna. పరిపాలన వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో 13 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయడాన్ని హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి

By అంజి  Published on  27 Jan 2022 7:37 PM IST
హిందూపురంను.. శ్రీసత్యసాయి జిల్లాగా ప్రకటించాలి: ఎమ్మెల్యే బాలకృష్ణ

పరిపాలన వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో 13 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయడాన్ని హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్వాగతించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంట్‌ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా.. అటు వ్యాపారపరంగా, వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన విషయం అందరికే తెలిసిందేనని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

కాబట్టి.. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ శ్రీసత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హిందూపురం పట్టణ పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం, భవిష్యత్తు అవసరాల కోసం కావాల్సిన భూమి పుష్కలంగా ఉందన్నారు. జిల్లా ఏర్పాటులో రాజకీయం చేయొద్దని బాలకృష్ణ అన్నారు. హిందూపురం పట్టణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి, వారి చిరకాల కోరిక అయినటువంటి హిందూపురం పార్లమెంట్‌ జిల్లా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాని అన్నారు.

Next Story