కొడాలి నాని ఇంటి వద్ద హై టెన్షన్
High Tension At Kodali Nani Houseకొడాలి నాని ఇంటి వద్ద నేడు ఉద్రికత్త నెలకొంది. గుడివాడలోని కొడాలి నాని
By Medi Samrat
కొడాలి నాని ఇంటి వద్ద నేడు ఉద్రికత్త నెలకొంది. గుడివాడలోని కొడాలి నాని ఇంటివద్దకు జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలని కోరుతూ ఇంటి ముట్టడికి దిగిన జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొడాలి నాని ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. గుడివాడలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు, జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన కార్యకర్తలు కొడాలి నాని ఇంటిని ముట్టడించారని తెలియడంతో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈరోజు ఉదయం ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టింది. జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ 'గుడ్ మార్నింగ్ సీఎం సార్' అనే హ్యాష్ ట్యాగ్‌తో గుంతలు ఉన్న రోడ్ల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. రావుల పాలెం నుంచి అమలాపురం వెళ్లే రోడ్డులో కొత్తపేట దగ్గర అధ్వాన స్థితిలో ఉన్న రోడ్డు వీడియోను పోస్టు చేశారు.