జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. జగన్ సర్కార్ కు ఊరట

High Court Stay On Local Body Elections. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హై కోర్టు సింగిల్ బెంచ్‌ ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది.

By Medi Samrat  Published on  25 Jun 2021 10:48 AM GMT
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. జగన్ సర్కార్ కు ఊరట

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హై కోర్టు సింగిల్ బెంచ్‌ ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. ఎన్నికలు రద్దు చేయాలన్న సింగిల్‌ బెంచ్ ఆదేశాలను నిలిపి వేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఊరట కలిగినట్లైంది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ శుక్రవారం స్టే విధించింది. జులై 27న సమగ్ర విచారణ జరుపుతామని డివిజన్ బెంచ్ తెలిపింది. తదుపరి ఉత్తర్వుల వచ్చే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకే ఎన్నికలు జరిపామని ఎస్‌ఈసీ లాయర్‌ కోర్టుకు వివరించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకే తాము ఎన్నికలు జరిపామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది డివిజన్ బెంచ్ కు నివేదించారు.

ఏపీలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేసి, మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం తెలిసిందే. దీనిపై ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు విచారణ చేపట్టింది. రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. పరిషత్ ఎన్నికల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాల్సి ఉందని ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టరాదని స్పష్టం చేసింది.


Next Story