కోడి కత్తి శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చేనా.?

కోడి కత్తి శ్రీనివాసరావు బెయిల్ కేసులో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

By Medi Samrat  Published on  24 Jan 2024 9:04 PM IST
కోడి కత్తి శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చేనా.?

కోడి కత్తి శ్రీనివాసరావు బెయిల్ కేసులో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోడి కత్తి శ్రీను పిటిషన్ ఇటీవల దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లకు పైగా జైల్లో మగ్గుతున్నానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోడి కత్తి శీను గతంలో ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. బెయిల్ ఇచ్చేందుకు ఎన్ఐఏ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా కావాలనే విచారణ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కోడి కత్తి శీను నాలుగున్నరేళ్ళుగా జైల్లో ఉండవలసి వస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

ఇక సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నిందితుడు కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు ఆదివారం రాత్రి దీక్షను విరమించారు. పలువురు రాజకీయ పార్టీ నాయకులు కోడి కత్తి శీను తల్లి సావిత్రమ్మ, సుబ్బరాజుతో మాట్లాడి జ్యూస్ తాగించి దీక్షను విరమింప చేశారు.

Next Story