ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు

High Court Orders To AP Govt. ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నిక‌ల

By Medi Samrat  Published on  23 Dec 2020 10:51 AM GMT
ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ పై నేడు హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది.

ఎస్ఈసీని ప్ర‌భుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం క‌ల‌వాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. క‌రోనా ప‌రిస్థితుల‌పై కూడా ఎస్ఈసీ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని హైకోర్టు తెలిపింది. అధికారుల బృందం ఎస్‌ఈసీతో చర్చించిన అంశాలను తెలపాలన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. దీనిపై 29న తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితి వ్యాక్సినేష‌న్ కు ఏర్పాట్లు త‌దిత‌ర అంశాల‌పై అధికారుల బృందం ఎస్ఈసీతో చ‌ర్చించ‌నుంది. క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి కేంద్రం షెడ్యూల్ విడుద‌ల చేస్తే దానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే కోర్టుకు తెలిపింది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని ఎస్ఈసీ బావిస్తుండ‌గా.. అందుకు ప్ర‌భుత్వం స‌సేమీరా అంటోంది.



Next Story