'వ్యూహం' సినిమా విషయంలో వర్మకు గుడ్ న్యూస్ వచ్చేనా.?
వ్యూహం సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని సింగిల్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
By Medi Samrat Published on 3 Jan 2024 12:15 PM GMTవ్యూహం సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని సింగిల్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ సినిమా విడుదల కాకపోవడం వల్ల తన క్లయింట్ కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందని దాసరి కిరణ్ కుమార్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. విచారణను సింగిల్ బెంచ్ ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసిందని.. దీనిపై స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్‌లో తేల్చుకోవాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.
వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని..అంతేకాకుండా చంద్రబాబు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ మూవీ రిలీజ్ చేయొద్దని నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో లోకేష్ పిటిషన్ ను విచారణ చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. డిసెంబర్ 3న వ్యూహం మూవీ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే సినిమా విడుదలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రొడ్యూసర్ దాసరి కిరణ్‌కుమార్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 11 వరకు వ్యూహం సినిమా రిలీజ్ చేయొద్దని..ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ, ఈనెల 11కు బదులు 8 వ తేదీన విచారణ జరిపి, ఆదేశాలు ఇవ్వాలని సినిమా మేకర్స్ కోరారు. దీంతో మెరిట్స్ ఆధారంగా చేసుకుని ఈనెల 8 న వ్యూహం సినిమాపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్ కు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.