సీఎం జగన్‌కు హైకోర్టు ఉద్యోగుల లేఖ
High Court Employees letter to cm ys jagan. ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. రాష్ట్ర ఉద్యోగుల
By Medi Samrat Published on 8 Feb 2022 10:46 AM GMTముఖ్యమంత్రి జగన్ కు ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను, ఆవేదనను మీ దృష్టికి తీసుకురావడంలో పీఆర్సీ సాధన సమితి నేతలు విఫలమయ్యారని లేఖలో హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో లోటుపాట్లను గుర్తించాలని, తమకు జరిగిన అన్యాయంపై దృష్టి సారించాలని కోరారు. అశుతోష్ మిశ్రా కమిటీ పీఆర్సీ రిపోర్టును పూర్తిగా పక్కన పెట్టారని, కేవలం మంత్రుల ఉపసంఘం నిర్దేశించిన ఫిట్ మెంట్ నే ప్రకటించారని తెలిపారు. పీఆర్సీ సాధన సమితి ఇటీవల జరిగిన చర్చల సమయంలో అశుతోష్ మిశ్రా నివేదిక అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిందని మండిపడ్డారు.
ఉద్యోగుల సమస్యలపై పూర్తి పరిష్కారం చూపకుండానే పీఆర్సి సాధన సమితి ఉద్యమాన్ని నీరుగార్చిందని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఆవేదనను మీ దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగ సంఘాల నాయకులు విఫలం అయ్యారు. కాబట్టి ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై పునరాలోచించి ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై దృష్టి పెట్టండని కోరారు. గత పీఆర్సీలోని లోటుపాట్లను గుర్తించి మరింత మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని వేణుగోపాల్ పేర్కొన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ పీఆర్సీ రిపోర్టును పూర్తిగా పక్కనపెట్టి కేవలం మంత్రుల ఉపసంఘం నిర్దేశించిన మేరకే ఫిట్ మెంట్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో వేల ఉద్యోగుల గుండెల్లో రగిలిన వ్యధనుండే పీఆర్సీ సాధన సమితి ఏర్పాటయ్యింది.
కానీ సాధన సమితి మొదటి డిమాండే అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ప్రకారమే ఫిట్ మెంట్ ప్రకటించాలని, దీన్నే ఇటీవల జరిగిన చర్చలో పూర్తిగా పక్కనపెట్టారని ఉద్యోగ సంఘాలపై హైకోర్టు ఉద్యోగ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. HRA స్లాబ్ మార్పుతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. గతంలో మాదిరిగానే HRA ను కొనసాగించాలని కోరారు. మీ అంకెల గారడీ వల్ల సగటు ఉద్యోగి పడుతున్న మానసిన వేదన వర్ణణాతీతమని విమర్శించారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, సీపీఎస్ రద్దు,కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పిటిడి ఉద్యోగుల అంశాలపై స్పష్టమైన ప్రకటన రాలేదన్నారు.