చంద్రబాబుకు బ‌ర్త్ డే గిప్ట్ ఇచ్చిన అభిమానులు

Here is the song promo released by the TDP party cadre. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

By Medi Samrat  Published on  20 April 2022 2:23 PM IST
చంద్రబాబుకు బ‌ర్త్ డే గిప్ట్ ఇచ్చిన అభిమానులు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నేడు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ అభిమానులు ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో 'చంద్రన్న కథా గానం' పేరుతో ప్రోమోను విడుదల చేసింది. ఈ రోజు పండుగలా భావించిన పార్టీ క్యాడర్ వినూత్నంగా ఆలోచించి తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఓ పాటను రూపొందించి టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్‌లో విడుదల చేసింది.

ఈ ప్రోమోలో తల్లిదండ్రులతో పాటు చంద్రబాబు ఫోటోలు, ఆయన రాజకీయ ప్రయాణం ఉన్నాయి. చంద్రబాబు పుట్టినరోజు పార్టీ శ్రేణులకు పండగే అని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన ఈ వీడియో సాంగ్‌ను చంద్ర‌బాబు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

28 సంవత్సరాల వయస్సులో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్ర‌బాబు.. అవిభ‌క్త ఆంధ్రప్రదేశ్‌లో అతి పిన్న వయసులో ఎమ్మెల్యే, మంత్రి అయ్యాడు. ఇప్ప‌టికీ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌గా రాజకీయ ప్రయాణం సాగిస్తున్న చంద్ర‌బాబు.. దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల‌లో ఒక‌రు.











Next Story