పవన్ కల్యాణ్ అప్పులు రూ.65 కోట్లు.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆస్తులు గత ఐదేళ్లలో 191 శాతం పెరిగాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
By అంజి Published on 23 April 2024 4:49 PM ISTపవన్ కల్యాణ్ అప్పులు రూ.65 కోట్లు.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆస్తులు గత ఐదేళ్లలో 191 శాతం పెరిగాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు. తన, భార్య, తనపై ఆధారపడిన నలుగురి పేర్లపై రూ.163 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. కాగా గత ఐదేళ్లలో ఆయన సంపాదన రూ.114. ఆదాయపన్నుగా రూ.47 కోట్లు, జీఎస్టీ కింద రూ.26 కోట్లు చెల్లించినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2019లో ఆయన ఆస్తులు రూ.56 కోట్లు. పిఠాపురం నుంచి పవన్ నామినేషన్ దాఖలు చేశారు.
పవన్ నెల్లూరులోని ఓ పాఠశాలలో 10వ తరగతి పాసయ్యాడు. 2018-19లో రూ. 1.1 కోట్ల నష్టాన్ని చవిచూడగా, 2022-23లో రూ. 12.2 కోట్ల ఆదాయాన్ని పవన్ ప్రకటించారు. పవన్‌కు 46 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నాయి, అతని భార్య అన్నా దగ్గర రూ.కోటి , అతనిపై ఆధారపడిన వారి నుండి 3.5 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు డిపాజిట్లు, రూ. 14 కోట్ల విలువైన కార్లు, బైక్‌లు ఉన్నాయి. పవన్‌కు రూ. 5.4 కోట్ల విలువైన హార్లే డేవిడ్‌సన్ బైక్, బెంజ్ మేబ్యాక్, రేంజర్‌ఓవర్ స్పోర్ట్,రూ. 2.3 కోట్ల విలువైన టయోటా క్రూయిజర్ ఉన్నాయి. అతను, అతని కుటుంబం జన్వాడ, మంగళగిరి, జూబ్లీహిల్స్‌లో రూ. 118 కోట్ల విలువైన స్థిరాస్తులను కలిగి ఉన్నారు.
పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగా 8 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. పవన్ కు రూ.65 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46.70 కోట్లు అని వివరించారు. వివిధ సంస్థలు, జనసేన పార్టీ నిర్వహించిన సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం రూ.17,15,00,000 విరాళం అందించినట్టు తెలిపారు. కేంద్రీయ సైనిక్ బోర్డుకు రూ.కోటి, ఏపీ సీఎం సహాయ నిధికి రూ.50లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.రూ.30,11,717, పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్‌కు రూ.2 లక్షలు విరాళం ఇచ్చినట్టు పేర్కొన్నారు.