ఏపీలో 5 రోజుల పాటు అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
By - అంజి |
ఏపీలో 5 రోజుల పాటు అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నెల్లూరు, చిత్తూరులో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. తిరుపతి, కడప, ప్రకాశంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. దీంతో ఆ జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం రేపు మధ్యాహ్ననికి నైరుతి,పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.ఆతదుపరి 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. pic.twitter.com/yiOXaW2Kxm
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 21, 2025
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం నేడు మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆతదుపరి 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు,ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
బుధవారం:ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ-అతిభారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది
గురువారం:బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ-అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నెల్లూరు, చిత్తూరులో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. తిరుపతి, కడప, ప్రకాశంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. దీంతో ఆ జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం నేడు మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆతదుపరి 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు,ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
బుధవారం:ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ-అతిభారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది
గురువారం:బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ-అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.