ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

By అంజి  Published on  18 Dec 2024 1:32 AM GMT
Heavy rains, APnews, APSDMA, Vizag

ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దానికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ రెండు రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవాళ విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Next Story