కంట్రోల్ రూంలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Head Constable Commits For Suicide In Kadapa. కడప జిల్లా కోర్టు సముదాయంలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూంలో ఓ హెడ్ కానిస్టేబుల్
By Medi Samrat Published on
21 July 2021 9:07 AM GMT

కడప జిల్లా కోర్టు సముదాయంలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూంలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాళ్లోకెళితే.. కడప కోర్టు ఆవరణలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్.. ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం రాత్రి విజయ్‌కుమార్ పోలీస్ కంట్రోల్ కార్యాలయానికి విధుల నిమిత్తం వచ్చారు. బుధవారం ఉదయం ఇతర సిబ్బంది విజయ్ కుమార్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండటాన్ని గమనించారు.
వెంటనే విషయాన్ని కడప వన్ టౌన్ పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విజయ్‌కుమార్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story