కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కళ్యాణ్ చెప్పాలి : హరిరామజోగయ్య

టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లకు ఒప్పుకోవడాన్ని చేగొండి హరిరామజోగయ్య అసలు ఒప్పుకోవడం లేదు.

By Medi Samrat  Published on  1 March 2024 4:30 PM IST
కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కళ్యాణ్ చెప్పాలి : హరిరామజోగయ్య

టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లకు ఒప్పుకోవడాన్ని చేగొండి హరిరామజోగయ్య అసలు ఒప్పుకోవడం లేదు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్లపై పవన్ విమర్శలు గుప్పించారు. అయితే హరిరామజోగయ్య జనసేనాని పవన్ కళ్యాణ్ కు మరోసారి లేఖ రాశారు.

జనసేన క్షేమం కోరి చేసిన సూచనలు, సలహాలు మీకు నచ్చినట్టు లేవని హరిరామజోగయ్య అన్నారు. ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారం చూస్తుంటే నన్ను విమర్శించినట్టే అనిపించిందన్నారు. నేను వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కళ్యాణ్ చెప్పాలి. నా అంచనా ప్రకారం జనసేనకు 40 స్థానాల్లో బలమైన అభ్యర్థులున్నారు. అలాంటప్పుడు 24 సీట్లే తీసుకోవడం ఎందుకని ప్రశ్నించాను.. అందుకని వైసీపీ కోవర్ట్ అయ్యానా? మీరు బాగుండాలన్న ఉద్దేశంతోనే బీజేపీని కూడా మీ కూటమిలోకి తీసుకోవాలని సూచించానన్నారు. మీ రాజకీయ జీవితాన్ని నిర్వీర్యం చేయడమే టీడీపీ లక్ష్యం. తన రాజకీయ లబ్ది కోసం టీడీపీ మిమ్మల్ని నాశనం చేస్తోంది. ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాలను ఓసారి పరిశీలించండి. మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకోండని హరిరామ జోగయ్య సూచించారు.

Next Story