అది ఫేక్ లెటర్.. ఇదీ అసలు లెటర్
మాజీ మంత్రి హరిరామ జోగయ్య పేరిట.. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన పేరుతో ఓ లేఖ వైరల్ అయింది.
By Medi Samrat Published on 25 Dec 2023 12:30 PM GMTమాజీ మంత్రి హరిరామ జోగయ్య పేరిట.. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన పేరుతో ఓ లేఖ వైరల్ అయింది. ఆ లేఖలో పవన్ నిర్ణయాన్ని జోగయ్య తప్పుబట్టారని.. ప్యాకేజీ ఆరోపణలు నిజమే అనిపిస్తుందంటూ అందులో ఉండడంతో అందరూ షాక్ అయ్యారు. గతంలో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచిన హరిరామ జోగయ్య ఒక్కసారిగా ఇలా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారేంటబ్బా అనే అనుమానం అందరికీ కలిగింది. అయితే ఈ లేఖ ఒరిజినల్ కాదని తెలుస్తోంది.
అది ఫేక్ అంటూ తాజాగా హరిరామ జోగయ్య మరో లేఖను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లేఖను తాను రాయలేదని హరిరామ జోగయ్య స్పష్టం చేస్తూ మరో లేఖను విడుదల చేశారు. టీడీపీ-జనసేన మైత్రిని దెబ్బతీసే విధంగా వైసీపీ సానుభూతి పరులు ‘కాపు సామాజిక వర్గానికి ఒకవిన్నపం’ అంటూ నా పేరుతో ఫేక్ లెటర్ విడదల చేశారని ఆరోపించారు జోగయ్య. దీన్ని జనసైనికులు గమనించాలని.. చీప్ ట్రిక్స్ కి పాల్పడుతూ వైసీపీ వారి ట్రాప్ లో పడకుండా తప్పుడు వార్తలను నమ్మకుండా పవన్ కళ్యాణ్ సీఎం పీఠం అధిష్టించే వరకు అంతా ఆయన వెంట ఉండాలని లేఖలో చెప్పుకొచ్చారు హరిరామ జోగయ్య. తెలుగు దేశం జనసేన పార్టీల కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆ లేఖలో అన్నారు. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ల మైత్రి బంధాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా మరెన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారని జాగ్రత్తగా ఉండాలని ఆ లేఖలో హెచ్చరించారు.