గుడివాడలో కొడాలి నానికి షాక్

Gudivada YCP Leaders Polanki Brothers Join In Janasena. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్ త‌గిలింది.

By Medi Samrat  Published on  9 July 2022 8:00 PM IST
గుడివాడలో కొడాలి నానికి షాక్

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్ త‌గిలింది. వైసీపీని వీడి పోలంకి బ్రదర్స్ శ‌నివారం సారధిబాబు, మోహన్ బాబు జనసేనలో చేరారు. జ‌న‌సేన పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో పోలంకి బ్రదర్స్ జనసేన లో చేరారు. నాదెండ్ల మనోహర్ వీరికి జనసేన జెండా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా పోలంకి సారధిబాబు మాట్లాడుతూ.. 2019 నుండి వైసీపీలో కొనసాగుతున్నట్లు తెలిపారు. కొడాలి నానితో కలిసి వైసీపీ విజయానికి పని చేసిన‌ట్లు పేర్కొన్నారు.

అయితే.. ఇటీవల కాలంలో కొడాలి నాని శృతి మించి మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ పై తరచూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని.. మేము రాజకీయ విమర్శలు చేయాలని కోరినా నాని పట్టించుకోలేదని విమ‌ర్శించారు. గుడివాడ లో నాని వ్యాఖ్యలను ప్రజలే చీదరించుకుంటున్నారని.. ఇక వైసీపీలో కొనసాగలేమని నిర్ణయం తీసుకుని బయటకు వచ్చామ‌ని తెలిపారు. ఈరోజు జనసేన లో చేరడం ఆనందంగా ఉందని.. జనసేన పార్టీ విజయం కోసం అందరినీ కలుపుకుని పని చేస్తామ‌ని తెలిపారు.













Next Story