ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సందర్శనకు వెళ్లనుంది. ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఏప్రిల్ 11న సీఎం చంద్రబాబు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ క్రమంలోనే దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో నేడు ఉదయం 10:30కి ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించనుంది. ఏర్పాట్లు పరిశీలనకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పలువురు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధులు వెళ్లనున్నారు. మంత్రుల బృందానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆలయ పరిసరాల్లో ఏర్పాట్ల పర్యవేక్షణకు అధికారులు సన్నద్ధం అయ్యారు.