అమరావతి: నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయం 5వ భవనంలో మంత్రుల బృందం(జిఓఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరగనుంది. ఈసమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పియూష్ కుమార్ తదితర అధికారులు పాల్గోనున్నారు. అదే విధంగా గుర్తింపు పొందిందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గోనున్నారు.