మరిన్ని జాబ్స్ : ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

By Medi Samrat  Published on  8 Dec 2023 8:00 PM IST
మరిన్ని జాబ్స్ : ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలు భారీగా అయితే లేవు కాని.. మొత్తం 81 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయింది. వీటిలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీల పోస్టులు కూడా ఉన్నాయి. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ www.psc.ap.gov.in లో అందుబాటులో ఉన్నాయి.

అంతకు ముందు రోజు 897 పోస్టుల‌తో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ గ్రూప్-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 897 పోస్టులు విడుదల చేయగా.. అందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి డిసెంబ‌ర్ 21 నుంచి జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వ‌హించ‌నున్నారు.ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్‌ పరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత మెయిన్‌ పరీక్ష తేదీలను ప్రకటిస్తారు. మెయిన్‌ రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష ఉంటుంది.

Next Story