ఏపీలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ..లక్ష మందికి ఉపాధి!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక నవశకానికి పునాది పడింది.

By -  Knakam Karthik
Published on : 23 March 2026 4:42 PM IST

Andrapradesh, Anakapalli, SteelPlant, Arcelor Mittal, CM Chandrababu, PawanKalyan, Industrial Growth, Employment

ఏపీలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ..లక్ష మందికి ఉపాధి!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక నవశకానికి పునాది పడింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలోని రాజయ్యపేట వద్ద రూ.80 వేల కోట్లకు పైగా భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న 'ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్‌'కు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా భూమిపూజ నిర్వహించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు , కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మరియు ఆర్సెలార్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్ పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్లాంట్ నిర్మాణ నమూనాను, ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను నేతలు సందర్శించి ప్రాజెక్టు విశేషాలను తెలుసుకున్నారు.

రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేయనున్న ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయగా, ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీని పారిశ్రామిక హబ్‌గా మార్చడంలో ఈ స్టీల్ ప్లాంట్ అత్యంత కీలక పాత్ర పోషించనుందని నిపుణులు భావిస్తున్నారు.

Next Story